. దుబ్బాక మున్సిపల్, మండల కేంద్రంలో 25 పాఠశాల ఎంపిక
. పద్మనాభునిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 100 శాతం పనులు పూర్తి
. 22 లక్షలతో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పన
.ఫర్నిచర్, ప్లంబింగ్, విద్యత్ ,ఇతర పనులు పూర్తి
నవతెలంగాణ దుబ్బాక రూరల్
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ.... ప్రయివేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడవాలని, అందులోనూ విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చుకోనుటలో రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, నాణ్యమైన విద్య,ఇతర సౌకర్యాలను కల్పిస్తుంది. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ప్రతి పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచి కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పనులు ప్రారంభించి ,తొందరగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా తయారు అవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలోని ప్రతి జిల్లాలో పనులు పూర్తైన పాఠశాలలను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది . ఇందులో భాగంగానే ప్రభుత్వంమన ఊరు- మనబడి, మనబస్తి-మనబడి అనే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల అభివృద్ధి, పునరుద్ధరణ ఈ కార్యక్రమం లక్ష్యం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం ,మున్సిపాలిటీ పరిధిలో మన మొత్తంగా మన ఊరు- మనబడి, మనబస్తి-మనబడి అనే కార్యక్రమానికి 25 పాఠశాలలు ఎంపికైనట్లు సమాచారం. ఐతే దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామంలో మన ఊరు -మన బడి కార్యక్రమం కింద జూన్ 2022 న పనులు ప్రారంభం కాగా .... విద్యుత్, ప్లంబింగ్, పెయింటింగ్,టాయిలెట్స్ ఇతర పనులు పూర్తి అయ్యాయి. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ పథకం ద్వారా ప్రహరీ గోడ పనులు సైతం ముందుకు సాగుతున్నాయి. మొత్తంగా ఈ పాఠశాలకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా 22లక్షలు.... నిధులు మంజూరయ్యాయి.ప్రహరీ గోడ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పద్మనాభునిపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గతంలో కంటే ఎక్కువగా పలు రకాల అభివృద్ధి పనులు ముగించుకుని ఫిబ్రవరి 1 న ప్రారంభానికి అన్నిరకాల ఏర్పాట్లతో ప్రారంభానికి ముస్తాబవుంతుంది. కొత్తగా అలంకారమైన ఈ పాఠశాలను పిల్లలు, విద్యార్థులు, గ్రామస్తులు చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జానకీ రామ్ 7 గురు ఉపాధ్యాయ సిబ్బంది పనిచేస్తుండగా...103 మంది విద్యార్థిని , విద్యార్థులు విధ్యభాసం చేస్తున్నారు
ప్రారంభ అతిథులు వీరే..
పద్మనాభునిపల్లి పాఠశాల పనులు పూర్తి కాగా బుధవారం ప్రారంభానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్,ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్,జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా విద్యా అధికారి , ఎంఆర్వో , ఎంపీడీవో, ఎంఈవో, ఎంపీపీ,జడ్పీటిసి, ఎంపీటీసీలు, పలువురు హాజరుకానున్నారు.
ప్రభుత్వం బడులకు పెద్ద పీట
సర్పంచ్ కె.పర్శారాములు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం తీసుకొచ్చి ప్రభుత్వ బడులకు పెద్ద పీట వేసింది. తద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించి వారి భవిషత్ కి ఈ కార్యక్రమం మంచి
పునాది కానుంది. రానున్న రోజుల్లో మరింత మంది పిల్లలు ఆకర్షితులై పాఠశాలలో సంఖ్య పెరగనుంది. పాఠశాలను ఎంపిక చేసి దశల వారిగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక డఆరోగ్య మంత్రి హరీశ్ రావు,మెదక్ ఎంపీలకు కృతజ్ఞతలు.నేడు ప్రారంభించుకోడం సంతోషకరం.
ప్రారంభానికి అంత సిద్ధం
ఎంఈవో జోగు ప్రభుదాస్
దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో
పలు రకాల పనులు పూర్తైయ్యాయి. దుబ్బాక మున్సిపాలిటీ, మండల కేంద్రంలో మొత్తంగా 25 ఎంపిక అయ్యాయి. మిగతా చోట్ల పనులు నడుస్తున్నాయి. ప్రారంభం కానీ చోటఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
త్వరితంగా పనులు ప్రారంభించి అమలులోకి తెస్తాం. మండలంలో మొదటగా పద్మనాభునిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పనులు పూర్తి అయ్యాయి. ప్రహరీ గోడ పనులు చివరి దశలో ఉన్నాయి.ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 08:41PM