నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన కోట్ల భాగన్న 48 గత మూడు నెలల క్రితం భర్తతో చిన్నపాటి గొడవ పెట్టుకుని ఇంటి నుండి వెళ్లిపోయిందని మనస్థాపం చెంది సోమవారం రాత్రి తన ఇంట్లోనే తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. మృతుని తమ్ముడు కోట్ల సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ ఐ తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చరికి తరలించారు.