నవతెలంగాణ-ధర్మసాగర్
మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి మొదటి బ్రహ్మోత్సవాలు గురువారం అర్చకులు రంగాచార్యులు, దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.సాయంత్రం 7 గంటలకు గుడి నుండి మొదలయ్యి ప్రధాన పురవీధులైన శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, ప్రభుత్వ కళాశాల,ఉదరోని గడ్డ, ఎర్రగుంట,నెహ్రు బొమ్మ, మెయిన్ రోడ్ బట్టల షాప్,చాట్ల రాములు దుకాణం,రెడ్డిస్ వినాయక మంటపం, తోకలోల వాడ, బంగ్లా నారాయణ ఇంటి ముందు నుండి గుడి వరకు నిర్వహించారు. భక్తులు,గ్రామస్తులు అందరు రధంనికి నీళ్లుతో మంగళగారతలతో భక్తి ఆట పాటలతో స్వామి వారికి మంగళహారాతులు ఇచ్చి స్వామి వారి అనుగ్రహంలు పొందారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొల్లిపాక వనమాల, మాజీ సర్పంచి కూనూరు రాజు, ప్రముఖులు రేడియో సదానందం,నాగవెల్లి యుగంధర్, నాగవల్లి రాజేందర్, పాక శ్రీనివాస్, దేవేందర్, శ్రీనివాస్ భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.