- నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి
నవ తెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అంగన్వాడి సెంటర్లోని చిన్నారులకు తన వంతు సహకారం అందజేస్తానని నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాజ్ సుఖ్ నగర్ కాలనీ అంగన్వాడి కేంద్రం లో పిల్లలకి పలకలు , బలపాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. చిన్నారుల కు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీ అధ్యక్షుడు బాల్ రెడ్డి ,
ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కోశాధికారి రవి యాదవ్ జాయింట్ సెక్రెటరీ రాజన్న ఉపాధ్యక్షుడు స్వాతి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు నాయకులు ఉపేందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ప్రవీణ్ యాదవ్ భాస్కర్ నాయుడు బాబురావు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 08:29AM