- జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
నవతెలంగాణ-శంకరపట్నం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లొ పేదలకు, ఉపాధి హామీ పథకానికి, నిధులు ఎక్కువ కేటాయించకపోవడం చాలా బాధాకరమని ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయకుండా జాప్యం చేస్తుందనీ, వితంతు, వికలాంగులు, ఆశ, పెన్షన్లు కొత్తగా ఇవ్వడం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నిధులు నియామకాలు నీళ్లు అనే నినాదాలతో నూతనంగా రాష్ట్రం ఏర్పడిందనీ ఇట్టి నినాదాలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయిందన్నారు.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నా ప్రభుత్వము ఇవ్వకుండా నూతనంగా కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ వాటిని రిక్రూట్మెంట్ చేయడంలో పూర్తిగా జాప్యం చేస్తున్నది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్రంగా ప్రజలలో వ్యతిరేకత వచ్చిందనీ, రైతాంగానికి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా జాప్యం చేస్తుందని, తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వము ఇలాగే జాప్యం చేస్తే ఫిబ్రవరి చివరి వారంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలన్నీ ముట్టడి చేస్తామని పేద ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కే సదానందం, డి కుమార్, టి రవి, ఎస్ వెంకటయ్య, టి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 03:13PM