నవతెలంగాణ-కంటేశ్వర్
34వ దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన-2023 పోటీలు ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జనవరి 27 నుండి 31 వరకు కేరళలోని త్రిచూర్లో జరిగాయి. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రదర్శనలు ఈ పోటీలలో పాల్గొనగా ఎన్విరాన్మెంటల్ కంజెన్స్ విభాగంలో వ్యర్థాల నుండి సంపద (వెల్త్ ఫ్రం వేస్ట్) అనే అంశంపై గైడ్ టీచర్ మధు వి.కె. ఆధ్వర్యంలో 9వ తరగతి చదివే కె. వంశీకృష్ణ, పి.వాఙ్మయి పాల్గొని నాల్గవ స్థానాన్ని పొంది జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యారు.
పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థ ప్లాస్టిక్ వస్తువుల నుండి ఇందనాన్ని తయారుచేసే విధానాన్ని తమ ప్రయోగం ద్వారా ఈ ప్రదర్శనలలో వివరించారని కరస్పాండెంట్ ప్రభాదేవి తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల కార్యదర్శి డా. అమృతలత, కరస్పాండెంట్ వి.ప్రభాదేవి, అకాడమిక్ డైరెక్టర్ టి.వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి.సుజాత, ప్రిన్సిపాల్ పి.విజేత ప్రత్యేకంగా అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 03:39PM