నవతెలంగాణ-కంటేశ్వర్
భారతదేశ సినీ పరిశ్రమలో తెలుగువారి పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే. విశ్వనాథ్ మరణం తీరని లోటు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నో మరపురాని చిత్రాలను, అనేక సందేశాత్మక చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకులు విశ్వనాథ్. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm