- డిఅర్డిఏ,డిఅర్డిఓ పిడి చందర్ నాయక్
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో అందరు కంటి పరిక్షలకు చేయించుకోవాలని డిఅర్ డిఎ, డిఆర్ డిఓ పిడి చందర్ నాయక్ సూచించారు. శుక్రవారం డిచ్ పల్లి మండలంలోని దేవనగర్ క్యాంప్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు, నర్సరీ లను ఆకస్మికంగా ఎంపిడిఓ గోపి బాబు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పిడి చందర్ నాయక్ మాట్లాడుతూ కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు చేయించుకోవాలని అవసరం ఉన్నా వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మంచిదా జరుగుతుందని గ్రామంలో ఉన్న వారి వివరాలు తదితర విషయాలను వైద్య సిబ్బంది ని అడిగి తెలుసుకోని పలు సూచనలు సలహాలను అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ అధ్వర్యంలో నేలకోల్పిన నర్సరీ ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయన వేంట ఎంపిటిసి సాయిలు, బీఅర్ఎస్ సినియర్ నాయకులు యూసుఫ్, ఉపసర్పంచ్- బుచ్చమ్మ, కార్యదర్శి శ్రీవాణి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 04:14PM