- రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే శోభన్ బాబు
నవతెలంగాణ-డిచ్ పల్లి
శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెలకువలను ఉపయోగించి క్రమశిక్షణతో అందరు కలిసి కట్టుగా రాణించి రాష్ట్ర జట్టును ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే శోభన్ బాబు అన్నారు. శుక్రావారం డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల క్రీడా మైదానంలో గత పది రోజులుగా జరుగుతున్న రాష్ట్ర సీనియర్ మహిళల సాఫ్ట్ బాల్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే శోభన్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5 నుండి 9 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో జరగనున్న 44వ సీనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెలకువలను ఉపయోగించి క్రమశిక్షణతో రాణించి రాష్ట్ర జట్టును ప్రథమ స్థానంలో నిలపాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ గోదావరి, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, జిల్లా ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, మర్కంటి సుజాత, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు అజయ్, పాఠశాల పి ఈ టి నల్లూరి లత, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ లు ఈ నరేష్, వేముల మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 04:37PM