- బీఎస్పీ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజెందర్ డిమాండ్
నవతెలంగాణ-గంగాధర
బీసీ కులాలకు చట్టసభల్లో 52% రిజర్వేషన్ కల్పించాలని బీఎస్పీ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో 52% రిజర్వేషన్ కల్పించాలని కోరుతుా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీఎస్పీ ఇంచార్జ్ నల్లాల రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శ అక్కి బాలకిషన్ మాట్లాడుతూ దేశంలో బీసీలు 52% శాతం ఉండగా, 27% రిజర్వేషన్ ను అమలు జరుగుతుందన్నారు.
బీసీ జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఊరూరా కోటి సంతకాల సేకరణకు పిలుపు నిచ్చారని అన్నారు. దేశ ప్రధాని బీసీనని చెప్పుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల జనగణన ఎందుకు చేయడం లేదని వారు ప్రశ్నించారు. బీసీల కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ బిఎస్పీ అనే అంశాన్ని బీసీ కులాలు గుర్తించాలని కోరారు. బీఎస్పీ అధిష్టానం తమ మేనిఫెస్టోలో బీసీల రిజర్వేషన్ అంశం చేర్చడంతోపాటు సమస్యల సాధనకు క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేపడుతుందని వారు స్పష్టం చేశారు.
ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు మంద రవిందర్, కొంకటి శేఖర్, జిల్లా కోశాధికారి కాంపెల్లి రాజు, జిల్లా కమిటీ సభ్యుడు బండపెల్లి శ్రీకాంత్, అసెంబ్లీ అద్యక్షుడు మాంకాళి తిరుపతి, ఉపాధ్యక్షుడు శమీమ్, అసెంబ్లీ మహిళా కన్వీనర్ వేల్పుల అనుాష, అసెంబ్లీ కమిటీ సభ్యులు అక్కనపెల్లి శేఖర్, బీఎస్పీ మండల అధ్యక్షులు పొత్తుారి సురేష్, సైదల దుర్గయ్య, భుాత్కుారి కాంత, మునుగుారి శ్రీనివాస్, అలువాల అజయ్, గంగాధర మండల కోశాధికారి గజ్జెల సతీష్, కార్యదర్శులు తడగొండ విజయ్, సతీష్ ద్యావ సురేష్ బీఎస్పీ సీనియర్ నాయకులు కల్లెపెల్లి రాజెందర్ సెక్టార్ కమిటీ ల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.