నవతెలంగాణ-డిచ్ పల్లి
రాష్ట్ర బడ్జెట్లో యూనివర్సిటీకి 500 కోట్లు కేటాయించాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చెయాలని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ డిమాండ్ చేశారు. శుక్రవారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర బడ్జెట్లో యూనివర్సిటీ 500 కోట్లు కేటాయించాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చెయాలని, బాలికలకు నూతన వసతి గృహాన్ని ఏర్పాటు, ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్నారు. పీజీ చదువుతున్న ప్రతి విద్యార్థికి 3000 వేల రూపాయలు ఫెలోషిప్ ఇవ్వాలని, యూనివర్సిటీ లో ఆడిటోరియం ఏర్పాటు చేయాలని, అన్ని క్రీడలకు అనుగుణంగా గ్రౌండ్ నిర్మాణం చేయాలని, యూనివర్సిటీ విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య భద్రత, బాలికల, బాలుర వసతి గృహాల సమస్యలను వెంటానే పరిష్కరించాలని,క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు, క్యాంటీన్ ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులో తెవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ జరిగిన తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి పై వీసీ శ్వేత పత్రం విడుదల చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు సూరజ్ ,రవి, ఆర్బాస్, మనోజ్, యశ్వంత్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 04:45PM