నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యా వర్దిని కి యూనివర్సిటీ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ పిడిఎఫ్ యూ అధ్యక్షుడు సంతోష్, ఉపాధ్యక్షుడు శివ సాయి మాట్లాడుతూ నూతన బాలికల వసతిగృహం నిర్మించాలని, స్పోర్ట్స్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, స్పోర్ట్స్ కు సంబంధించిన పరికరాలు తీసుకురావాలని, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా గ్రౌండ్ ఏర్పాటు చేయాలని, హాస్టల్లో స్టడీ టేబుల్స్ కుర్చీలు తీసుకురావాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు అక్షయ్, ఆకాష్, గంగోలి, అశ్విత్, శేషు తదితరులు పాల్గొన్నారు.