నవతెలంగాణ-భిక్కనూర్
రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని నూతన ఎమ్మార్వో ప్రేమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో నూతన ఎమ్మార్వో ను సిద్ధ రామేశ్వర నగర్ సర్పంచ్ జనగామ శ్రీనివాస్ శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధ రామేశ్వర నగర్ గ్రామస్తులు భూమలింగం, సిద్దరాములు, యాదగిరి, నర్సింలు, సిద్ద రాములు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm