- అధికారి ఆర్ శ్రీనివాస్
నవతెలంగాణ-శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన చింతరెడ్డి మధుకర్ రెడ్డి అర్కండ్ల శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ శుక్రవారం హార్టికల్చర్ ఆఫీసర్ మంజువాణి, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ తో రైతులకు అధిక దిగుబడి వస్తుందని, మొక్కలు నాటిన నుండి మూడు సంవత్సరాల తర్వాత నుండి రైతుకు క్రాప్ వస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర పట్నం వ్యవసాయ అధికారి ఆర్ శ్రీనివాస్ ధర్మారం సర్పంచ్ చుక్కల రవి, వ్యవసాయ విస్తరణాధికారి లక్ష్మీ ప్రసూన, గ్రామ రైతు బంధు కో ఆర్డినేటర్ కోటయ్య, గ్రామ రైతులు మోతే ఎల్లారెడ్డి, వంగల గాల్ రెడ్డి, సంజీవ రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm