నవతెలంగాణ-డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ పద్మశాలి సంఘం ఎన్నికలు శుక్రవారం ఇందల్ వాయి మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ ఎన్నికల్లో అధ్యక్షులు పుల్గం హన్మండ్లు, ఉపాధ్యక్షులు యాదగిరి, జనరల్ సెక్రెటరీ లోలం జగదీష్ లు పాల్గొని నిర్వహించారు.విరితో పాటు ఏడు మండలాల పద్మశాలి సంఘల అధ్యక్షులు, పాల్గొని కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. వర్కింగ్ అధ్యక్షులుగా ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామానికి చెందిన చిలివేరి గంగా దాస్, రూరల్ అధ్యక్షులుగా ఇందల్ వాయి మండలంలోని అమ్సన్ పల్లి కి తన్నీరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి శేఖర్, వైస్ ప్రెసిడెంట్గా కట్నం రాజ్ కిషన్, కోశాధికారిగా తిర్మన్ పల్లి మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, సహాయ కార్యదర్శి నూకల రమేష్, ప్రచార కార్యదర్శి వెనుగందుల నరేష్, అధికార ప్రతినిధి పెండ్యాల రమేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గురుడు ముత్తన్న లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరిగి పద్మశాలి కుల బంధువులను కలిసి వారి యొక్క కుటుంబ వివరాలు సేకరించి వారికి న్యాయం చేసే వరకు వారి వేన్నేంట ఉంటామని ప్రమాణం చేశారు. చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కోరుతూ త్వరలో మంత్రులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు. వివిధ గ్రామాలకు సంబంధించిన కమిటీ హాలు నిర్మాణం కోసం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లి పుర్తి చేయిస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను పులమలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి శూబాకంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిర్మన్ పల్లి ఎంపీటీసీ చింతల దాస్, డాక్టర్ సామల రాజేష్, శేఖర్ తోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పద్మశాలి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 05:49PM