- బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ లో టి.పి.సి.సి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బీన్ హందాన్ మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణుల చేతుల మీదుగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులందరూ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రంగ సమస్యల పట్ల ఎన్.ఎస్.యు.ఐ సాగిస్తున్న పోరాటం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వారు అన్నారు. ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి విభాగం ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంఘం అని ప్రతి ఒక్క విద్యార్థి ఎన్.ఎస్.యు.ఐ లో సభ్యత్వం తీసుకొని విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తూ అనునిత్యం సామాజిక స్పృహ కలిగి ఉంటూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని వారు కోరారు. అలాగే ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లా కమిటీల కంటే బలంగా ఉందని జిల్లా ఎన్.ఎస్.యు.ఐ ఎప్పటికప్పుడు జిల్లాలోని విద్యారంగా సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తుందని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని కృషి చేస్తున్న ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ సభ్యులతో పాటు అధ్యక్షుడు వరదబట్టు వేణు రాజ్ ను తామంతా ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి, అధ్యక్షులు విక్కీ యాదవ్, నగర అధ్యక్షుడు ప్రీతం, ఎస్ సి ఆధ్యక్షులు గోపు ప్రభాకర్, మైనారిటీ ఆద్యక్షులు ఇర్ఫాన్ అలి, బ్లాక్ ఆధ్యాక్షులు కేశ మహేష్, అబుద్ బిన్ హందన్, పిసిసి కార్యదర్శి రంబుపల్, పిసిసి మెంబర్ ఈస, నగర మైనారిటీ ఆద్యాక్షులు అబ్దుల్ ఎజాజ్, కార్పొరేటర్ గడుగు రోహిత్, ఇండల్ వాయి మండల ప్రెసిడెంట్ నవీన్, దయాకర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 05:51PM