నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిభిరాన్ని ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచ్ పెంటమీదీ శ్రీనివాస్, ఎంపీటీసీ రాజు, ఎంపీడీఓ రాము కలిసి శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సర్పంచ్ శ్రీనివాస్ సూచించారు. ఎఎంసీ డైరెక్టర్ దీటీ రాజు, బీఆర్ఎస్ నాయకులు గణపురం తిరుపతి, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm