నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంగం జిల్లా అధ్యక్షులు కంజర్కర్ భూపతిరావు ఆధ్వర్యంలో కళా తపస్వి బ్రాహ్మణ బంధువు ప్రముఖ తెలుగు పరిశ్రమ దిగ్గజ ఫల్కె అవార్డు గ్రహీత పద్మశ్రీ దర్శకులు విశ్వనాధ్ నిన్న అనారోగ్యంతో మరణించడంతో వారిని స్మరించుకొని వినాయక్ నగర్ లోని బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో శుక్రవారం నివాళులు అర్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కోశాధికారి కిరణ్ దేశముఖ్ పండరి సత్యనారాయణధి, చంద్రశేఖర్ గోవింద్ రావు దేశముఖ్, లక్ష్మి నారాయణ భరద్వాజ్, మల్లికార్జున్ రావు ఘానా పాటి మధుసూదనశర్మ, పురుషోత్తమ్ రావు, సురేష్ శర్మ, అరుణ్ కుమార్, ప్రకాష్ కులకర్ణి మణికంఠ శర్మ, అప్పల కిష్టయ్య, రామానుజ చార్య, వెంకట వరద చార్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm