నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని గుర్జగుంట గ్రామంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న వ్యాధి నివారణ కిట్లను గ్రామ సర్పంచ్ కందడి మనోహర రమేష్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బోదకాల వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం పంపిణీ చేసిన ఐదు రకాల వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణుక, ఏఎన్ఎం యాదమ్మ, నాయకులు రమేష్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, వ్యాధిగ్రస్తులు, ఆశా వర్కర్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm