నవతెలంగాణ -నవీపేట్
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గుర్తించిన 17 బిసి కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కేంద్రమంత్రి రాందాస్ అథావళే కు శుక్రవారం బీసీ కులాల ప్రతినిధులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 17 కొత్త బిసి కులాలను గెజిట్లో చేర్చారని కానీ కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం వలన తమ పిల్లలకు కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు మరియు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని వెంటనే 17 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని విన్నవించగా త్వరలోనే కేంద్రం స్పందించి సమస్యను పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు.
అనంతరం ఓడ్ కుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 17 కులాల అధ్యక్షులు మోహన్ చవాన్, ఓడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పవార్ కైలాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ శరత్, బైలు కమ్మర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమాజీ సాలుంకే, అహిర్ యాదవ్ సంఘం నాయకులు అరుణ్ యాదవ్, సారకుల నాయకులు ప్రవీణ్, వేదాకర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 06:11PM