నవతెలంగాణ -తాడ్వాయి
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఫిబ్రవరి 6వ తారీకు నుండి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధి నుండి ప్రారంభం అవుతుంది కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడు పాదయాత్ర విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ సంపత్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బొల్లు విజయ దేవేందర్ లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ సునీల్ దొర అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తారీఖున మేడారం సమ్మక్క సారలమ్మ మనదేవతల దర్శించుకుని ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఆదేశాల మేరకు పాదయాత్ర ప్రారంభం అవుతుందని, ఈ పాదయాత్ర రెండు నెలల పాటు జరుగుతుందని తెలిపారు. దీనికి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు పాదయాత్రలో పాల్గొంటారని, పాదయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు సాయంత్రం పస్రా లో భారీ బహిరంగ సభ ఉంటుందని, అనంతరం పాదయాత్ర మొదలవుతుందని అన్నారు.
మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మండల గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్లు, నాయకులు మేధావులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, పిఎసిఎస్ డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డి, రంగరబోయిన జగన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు, మాజీ సర్పంచ్ లు బెజ్జూరి శ్రీనివాస్, లంజపెళ్లి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లూరి నాగార్జున్, కోటే నర్సింహులు, హనమండ్ల రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 06:12PM