నవతెలంగాణ-ఆర్మూర్
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టుల పై దాడులు చేయడం సిగ్గుచేటని పట్టణానికి చెందిన జర్నలిస్టులు అన్నారు..భువనగిరి జిల్లాలోని మోత్కూరులో నవ తెలంగాణ విలేఖరి పై జరిగిన దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం తాసిల్దార్ వేణు గోపాల్ గౌడ్ కు తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు ముత్యం, సో క్కల తిరుపతి సునీల్ లు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాసిన యాదగిరి అనే జర్నలిస్టుపై ఓ ప్రజా ప్రతినిధి దాడి చేయడం అమానుషమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడి కి పాల్పడ్డా వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సందీప్, చేతన్, సురేష్, వినోద్ కుమార్, అరుణ్ వినోద్, చిన్న, గణేష్ గౌడ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 06:15PM