నవతెలంగాణ-భిక్కనూర్
జిల్లా కేంద్రంలో శుక్రవారం దళిత బందులో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని, నిరుపేద దళితుల అందరికీ దళిత బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ మాట్లాడుతూ దళిత బంధు పథకం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm