నవతెలంగాణ-నవీపేట్
అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని శుక్రవారం ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం తాహసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజా తంత్ర మహిళ విభాగం జిల్లా కార్యదర్శి సబ్బాని లత మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ రేటును పెంచుతూ మధ్యతరగతి వారి నటి విరుస్తున్నారని అన్నారు.
అదేవిధంగా కరెంటు చార్జీలతోపాటు ఏసిడి అంటూ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్, మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్, వడ్డెర వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 06:41PM