- ఎమ్మెల్యే సీతక్క.
నవతెలంగాణ-గోవిందరావుపేట
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూఫిబ్రవరి 6 నుండి వనదేవతల దీవెనలతో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి ని ఆదరించాలని, జోడో యాత్రను విజయవంతం చేయాలని అండగా నిలవాలని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా 15 రాష్ట్రాలలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 136 రోజులు ఏకధాటిగా 4000 కిలోమీటర్లు నడిచి దేశాన్ని ఐక్యం చేస్తూ, దేశ సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ యాత్రను ఆదర్శంగా తీసుకుని, తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని కాపాడడానికి, హాత్ సే హాత్ జోడో యాత్రను మన మేడారం వనదేవతల ఆశీర్వాదంతో మొదలుపెడుతున్న యాత్రకు ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమాని హాజరయి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుతింటున్న రాక్షసుల పాలనపై తిరుగుబాటు చేసి, ప్రజా సమస్యలపై ముఖ్యంగా నిరుద్యోగ, రెండు పడకల ఇండ్లు, పోడు భూములకు పట్టాలు, ఏక కాలంలో రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, పెరిగిన ఆర్.టి.సి. చార్జీలు మరియు నిరోద్యోగ సమస్యలపై ధ్వజమెత్తుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం నెలకొల్పుటే లక్ష్యంగా యాత్రను ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి ని ప్రజలందరూ ఆశీర్వదించాలని, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ రేవంత్ రెడ్డి కి తోడుగా నిలబడాలని ప్రతి ఒక్కరినీ కోరారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, పాలడుగు వెంకటకృష్ణ, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి, కాడబోయిన రవి, చింత క్రాంతి, పడిగ పార్వతి, భూక్య రాజు, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, ఉపసర్పంచులు బద్దం లింగారెడ్డి, కట్ల జనార్దన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, వేల్పుగొండ ప్రకాష్, అలుగుబెల్లి కన్నయ్య, బర్ల సమ్మిరెడ్డి, బొల్లు కుమార్, సోమసాని నారాయణ స్వామి, దేపాక కృష్ణ, తండా రవి, తండా కృష్ణ, జంపాల చంద్రశేఖర్, గోపిదాసు రజిత, మాజిత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 07:24PM