- భక్తుల రద్దీతో కొనసాగుతున్న మేడారం
- క్యూలైన్ల ద్వారా దర్శనాలు
- తప్పిపోయిన వ్యక్తుల శిబిరాలను తనిఖీ చేసిన పిఓ అంకిత్
- వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
నవతెలంగాణ-తాడ్వాయి
మినీ మేడారం జాతర గత రెండు రోజుల నుండి వైభవంగా కన్నులపండువగా కొనసాగుతుంది. మినీ మేడారం జాతరకు 3వ రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పుణ్య స్థానాలతో జంపన్న వాగు కలకలాడుతుంది. జంపన్న వాగులో పుణ్య స్థానాల ఆచరించి తలనీలాలు సమర్పించి గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
మినీ మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ వనదేవతలను శుక్రవారం ప్రముఖులు, అధికారులు దర్శించుకున్నారు. 1983లో ఏటూర్ నాగారం ఐటిడిఏ పిఓ గా నిర్వర్తించిన రిటైర్డ్ ఐఎస్ అధికారి ఎం.జి గోపాల్ సకుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. 1983 కాలంలో ఏజెన్సీలోని ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు తెచ్చిన అధికారిగా మంచి గుర్తింపు పొందారు. ఏజెన్సీ అభివృద్ధికి గతంలోనే పెద్ద పీట వేసి ఆదివాసులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన ఏకైక ఐఏఎస్ అధికారిని, ఆదివాసులు, పూజారులు దగ్గరుండి దర్శనాలు చేయించారు.
ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజి గోపాల్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ పిఎస్ అండ్ చీఫ్ సెక్రటరీ జి గణేష్, తెలంగాణ స్టేట్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి ఎస్ ఆర్ డి సి) చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రాష్ట్ర ఎన్నికల సెక్రటరీ అశోక్ కుమార్, విద్యుత్ శాఖ సి.జి.ఆర్.ఎఫ్ నెంబర్ టెక్నికల్ తిరుమలరావు, విద్యుత్ శాఖ డీ ఈ పులుసు నాగేశ్వరరావు, మాజీ డి ఈ మహెందర్, నర్సంపేట డిఇ సదానందం, 9 మండలాల ఏఈలు విద్యుత్ సిబ్బంది లు కుటుంబ సమేతంగా వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. వీరందరికీ పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఆదివాసీ సంప్రదాయ ప్రకారం ఘనంగా స్వాగతం పలికి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
మినీ మేడారం జాతరలో తప్పిపోయిన భక్తుల శిబిరాలను సందర్శించిన ఐటీడీఏ పీవో అంకిత్
మినీ మేడారం జాతరలో జంపన్న వాగు, ఎండోమెంట్ మంచే, బయటికి వెళ్లి మార్గాన గద్దెల వెనుక భాగాన ఉన్న మూడు తప్పిపోయిన వ్యక్తుల శిబిరాలను శుక్రవారం ఐ టి డి ఏ, పి ఓ అంకిత్ సందర్శించి పరిశీలించారు. జంపన్న వాగు వద్ద తాడ్వాయి సిడిపిఓ మల్లీశ్వరి ఆధ్వర్యంలో పనిచేస్తున్న తప్పిపోయిన వ్యక్తుల శిబిరం బాగా పనిచేస్తున్నారని ఐటీడీఏ పీవో సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు తెలియచేయాలని, తప్పిపోయిన వ్యక్తులకు అందుబాటులో ఉండి అనౌన్స్ చేస్తూ వారిని వారి వారి బంధువులకు అప్పగించాలని సూచించారు.
బయ్యక్కపేటలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సమ్మక్క వనదేవత పుట్టినరోజు బయక పేటలో మండే మెలిగే పండుగ సందర్భంగా భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. పూజార్లు చంద గోపాల్, చందా రఘుపతి, చందా కళ్యాణ్, చందా పరమయ్య, ఆధ్వర్యంలో పూజారులు గత మూడు రోజుల నుండి సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొదటిరోజు అడవి నుండి సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకువచ్చారు. మొక్కుల పర్వం ఇంకా కొనసాగుతోంది. పూజార్లు భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 07:46PM