- డి.ఆర్.డి.ఎ పి.డి మధుసూదన్ రాజు
నవతెలంగాణ - అశ్వారావుపేట
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే రోజువారీ కూలీలకు వారి జాబ్ కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ శీఘ్రగతిన పూర్తి చేయాలని డి.ఆర్.డి.ఎ పీడీ మధుసూదన్ రాజు ఎం.డి.ఒ విద్యాధర్ రావు కు సూచించారు. ఆయన గురువారం మండలంలోని పలు పంచాయితీల్లో నిర్వహిస్తున్న హరిత హరం నర్సరీలను ఆకస్మికంగా తనిఖీలు చేసారు.
జమ్మి గూడెం, మద్దికొండ, అశ్వారావుపేట, పేరాయిగూడెం, కేసప్పగూడెం లోని హరిత హారం నర్సరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధి హామీలో కూలీల పెంపుదల, హరిత హారంలో మొక్కలు పంపిణీ కి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అదేశించారు. అయన వెంట పీ.ఓ నరేష్, ఆయా పంచాయితీల కార్యదర్శులు, టి.ఎ లు, ఎఫ్.ఎ లు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm