నవతెలంగాణ-తాడ్వాయి
108 బైక్ అంబులెన్స్ వికలాంగుడి ప్రాణాలు కాపాడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం తేజావత్ రవి అనే వికలాంగుడు మూడు చక్రాల వాహనం ద్వారా తాడ్వాయి నుండి మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తున్న క్రమంలో కామారం బ్రిడ్జి వద్ద అదుపుతప్పి కింద పడిపోయి తలకు, చేతులకు తీవ్ర గాయాలు అయినాయి.
వెంటనే సమాచారం తెలుసుకున్న 108 బైక్ అంబులెన్స్ ఈఎంటి కంటెం విజేందర్ సంఘటన స్థలానికి చేరుకొని తలకు, చేతులకు ప్రధమ చికిత్స చేశాడు. అంబులెన్స్ పెద్ద వాహనము వచ్చేదాకా ఉండి అతనిని మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ఎక్కించి ములుగు హాస్పిటల్ కు తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తేజావత్ రవి అనే వికలాంగుడిని కాపాడినందుకు 108 బైక్ అంబులెన్స్ ఈఎంటి విజేందర్ కు మండల ప్రజలు, అధికారులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ అయిన వికలాంగుడు తేజావత్ రవి ప్రభుత్వ ఉద్యోగి అని తెలిసింది. వెంటనే స్పందించి తేజావత్ రవి అనే వికలాంగుడి కాపాడిన బైక్ అంబులెన్స్ విజేందర్ సేవలు మరువలేనివని కొనియాడారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 08:26PM