నవతెలంగాణ - అశ్వారావుపేట
వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల కథనం ప్రకారం మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన పొట్ట మధు (40) కు భార్య, పిల్లలు ఉన్నారు. ఇతను వైద్య ఆరోగ్య శాఖ ద్వారా దమ్మపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్త (ఎంపీహెచ్ఎ)గా గడిచిని 12 ఏళ్లుగా పని చేస్తున్నాడు. అయితే ఆత్మహత్యకు వేతనాలు సక్రమంగా రాకపోవడం, సరిపడ వేతనం లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేక మనస్థాపం చెంది గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబీకులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రాజేశ్ కుమార్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి శవ పంచనామా జరిపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.