- విజ్ఞాన్ హై స్కూల్ 30వ వార్షికోత్సవంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్
- అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
- విజ్ఞాన్ ఆనందోత్సవంలో అలరించిన సినీ యాంకర్ మృదుల, ఆకట్టుకున్న జబర్దస్త్ ఫేమ్ రాము
నవతెలంగాణ-కంటేశ్వర్
విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి అని విజ్ఞాన్ హై స్కూల్ 30వ వార్షికోత్సవంలో నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ విజ్ఞాన్ వార్షికోత్సవ ఆనందోత్సవ 2023 కు ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విజ్ఞాన్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న 30వ వార్షికోత్సవ సంబరాలను ఆయన ప్రారంభించారు. పదో తరగతి విద్యార్థులు ఈ మూడు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ముందుకు సాగి పాఠశాల అధ్యాపకులు చెప్పినట్టు చదువుకొని నిర్భయంగా పరీక్షలు రాసి తల్లిదండ్రులకు జిల్లాకు విద్యాసంస్థకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఆయన అన్నారు. విజ్ఞాన్ హై స్కూల్ ఆనందోత్సవము 2023 వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రైవేటు విద్యాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధిలో ప్రైవేటు పాఠశాలల పాత్ర కీలకంగా ఉన్నదని సుమారు 55 శాతం విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను అందించడమే కాకుండా గణనీయంగా నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 30 సంవత్సరాలు విద్యాసేవలో పూర్తి చేసుకున్న విజ్ఞాన్ విద్యాసంస్థకు అభినందనలు తెలియజేస్తూ వారు మరింతగా ముందుకు వెళ్లాలని విద్యాసేవలో ఎందరో నిష్ణాతులైన రేపటి ఉత్తమ పౌరులను తయారు చేసే దిశగా వారి అడుగులు ముందుకు పడాలని ఆయన ఆకాంక్షించారు.
30 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు వార్షికోత్సవ సంబరాలను జరుపుకుంటున్న విజ్ఞాన్ విద్యాసంస్థలు ఆనందోత్సవం 2023 కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యా సంస్థ అందిస్తున్న విద్యా సేవల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.. ఇటువంటి యాన్యువల్ డే సంబరాలు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలిగితీయటానికి ఉపయోగపడతాయని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజ్ఞాన్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఏప్రిల్ నెలలో పరీక్షలు రాసే పదవ తరగతి విద్యార్థులు సమయం వృధా చేయకుండా కష్టపడి చదివి విద్యా సంస్థకు తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖకు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు.
విజ్ఞాన్ ఆనందోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తొలి గురువులైతే పాఠశాలలోని ఉపాధ్యాయులు గురుతరమైన బాధ్యత నిర్వహిస్తున్న దైవ సమానులని, అట్టి తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ వారి సూచనలను పాటిస్తూ వారి అడుగుజాడల్లో నడిచి విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చెడు సావాసాలకు లోను కాకుండా బాధ్యతాయుతమైనటువంటి జీవితంతో దేశం పట్ల ప్రజల పట్ల ప్రేమాతత్పరతతో ఉండి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించి విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. అంతకుముందు విచ్చేసిన యాంకర్ మృదుల, జబర్దస్త్ ఫేమ్ రాము విద్యార్థులను తమ అద్భుతమైన మాటలతో అలరించారు. అదేవిధంగా వారు సందడి చేసి నిజామాబాద్ విజ్ఞాన హై స్కూల్ 30 వార్షికోత్సవంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను పాఠశాల యాజమాన్యాన్ని సంతోషపరిచారు.
ఈ సందర్భంగా విజ్ఞాన్ హై స్కూల్ పాఠశాల యాజమాన్యం కవిత,జయ సింహ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్ధుల తల్లితండ్రులకు , మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా గౌరవ అతిధులకు, సంఘ సభ్యులకు పేరుపేరునా స్వాగతం తెలియజేశారు. ఈ చల్లని సాయంత్రం వేళ ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని గౌరవించి వచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు. విజ్ఞాన్ హై స్కూల్ అనేది ఒక చక్కటి వాతావరణంలో అందరినీ ప్రేమతో స్వాగతించి విద్యార్ధి విద్యనభ్యసించే కేంద్రం అని పాఠశాల యాజమాన్యం కవిత జయ సింహ గౌడ్ తెలియజేశారు. ప్రతి విద్యార్ధికి సాధ్యమైనంత ఉత్తమ విద్యను అందించడానికి మేము కట్టుబడి వుండి పిల్లలందరూ వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా చేయడమే తమ పాఠశాల లక్ష్యం.
అనుభవజ్ఞులైన విజ్ఞాన్ ఉపాధ్యాయులు, టీచింగ్ అసిస్టెంట్‌లు ప్రతిభావంతులు , అంకితభావం శ్రద్ధ గల సిబ్బంది ఉన్నారు. వారి సంరక్షణలో ఉన్న పిల్లల సామర్థ్యాలను పెంపొందించడానికి , అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడి పనిచేయటమే కాదు , పిల్లల కోసం ప్రతిరోజూ పాఠశాలను చాలా ప్రత్యేకమైన ప్రదేశంగా మార్చడానికి ఒకే బృందంగా పని చేస్తారు అని చెప్పటానికి నేను గర్వపడుతున్నాను అని తెలియజేశారు.
అందుకు నిదర్శనమే ఈ నాటి 30 వసంతాల విజయోత్సవ విజ్ఞాన్ ఆనందోత్సవం అని తెలియజేశారు. విద్యా రంగంలో 30 సంవత్సరాలు 1973 నుండి 2023 వరకు 30 సంవత్సరాల పూర్తి అంటే చిన్న విషయం కాదు . అన్నింటినీ తట్టుకొని నిలబడి, నాకు తోడ్పాటునందించిన సేపూర్ కవిత కి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు. విజ్ఞాన్ స్కూల్ లో సంబంధిత పాఠ్యాంశాలను విస్తృతమైన సబ్జెక్టు నాలెడ్జ్ తో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కేవలం సబ్జెక్టు , పరీక్షలు లేదా మార్కులు ర్యాంకులు అనే కాకుండా , విద్యార్ధుల సామాజిక ప్రవర్తనను ప్రోత్సహిస్తూ ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించే దిశగా నడిపిస్తూ , ఒక క్రమ పద్దతిలో , సురక్షితమైన వాతావరణంలో ప్రతి బిడ్డ ఇష్టాలకు విలువనిస్తూ, సాధన మరియు ప్రవర్తన రంగాలలో అభివృద్ధి పరుస్తూ ఒక ఉత్తేజభరితమైన వాతావరణాన్ని అందిస్తు పిల్లల అభ్యాసానికి సంబంధించిన అన్ని అంశాలను కలుపుకుని విద్యా బోధనను మేము మన విజ్ఞాన్ లో అవలంబిస్తున్నాము కనుకనే నేడు నిజమాబాద్ జిల్లలోనే ఒక ఉత్తమమైన మేటి పాటశాలగా గుర్తింపు పొందగాలిగాము.
తల్లిదండ్రుల సలహా సూచనలకు విలువిస్తూ, హాస్టల్ విద్యార్ధులకు హోం –స్కూల్ భాగస్వామ్యాన్ని కల్పించి ఇంటిని మరిపించేవిధంగా మంచి వాతావరణాన్ని, పౌష్టిక ఆహారాన్ని కల్పించడం జరుగుతున్నది అని తెలిపారు. పిల్లల పాఠశాల జీవితంలో తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేయడానికి స్కూల్ లో జరుగుతున్నా పనుల గురించి వారికి తెలియజేయడానికి తాము ఎల్లప్పుడూ కొత్త మార్గాలను అనుసరిస్తూ, అద్భుతమైన భవనంలో పిల్లలు మరియు ఉపాధ్యాయులకు ప్రపంచ స్థాయి అభ్యాస సౌకర్యాలను అందిస్తూ ఎప్పటికప్పుడు మారుతున్న కొత్త విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ టైం టు టైం ప్రపంచం తో పోటీ పడే విధంగా పిల్లలను తయారుచేస్తున్నాం అని తెలియజేశారు.
గత రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో అద్భుతమైన మార్పులను మనం చూస్తున్నాం. తరువాతి తరం విద్యార్థుల జీవనానికి కొత్త పద్ధతులను అన్వేషించడానికి ఇది సరైన సమయం. ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు. విద్యార్థుల సెల్ఫ్ లెర్నింగ్ మరియు అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ కు అదనపు ప్రాధాన్యత ఏర్పడింది. టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అనేది నేటి సమాజంలో నేర్చుకోవలసిన ముఖ్యమైన అంశం అని తెలిపారు. ఇలా చెప్పకుండా పోతే కదా 30 సంవత్సరాలుగా తమ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేస్తూ మొన్న అందులో ఉన్నామని అలాగే విద్యార్థులు 30 సంవత్సరాలుగా తమ పాఠశాలలో చదివిన వారు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు అలక కిషన్, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్, పాఠశాల అధ్యాపకరం బృందం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.