-ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
నవతెలంగాణ-గంగాధర
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేయగా, పద్మశాలి ఫంక్షన్ మిగులు పనులు, ఓపెన్ జిమ్ తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నడిచి వెళ్తూ తనకు తారసపడిన గ్రామానికి చెందిన పొత్తూరి కనుకవ్వను అవ్వ బాగున్నవా..అంటూ అప్యాయంగా పలకరించి బాగోగులు తెలుసుకున్నారు. పెన్షన్ వస్తుందా ఎందరు పిల్లలు ఏం చేస్తారంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పల్లెల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో ప్రజలకు స్వచ్చమైన మంచినీరు అందించడం జరుగుతుందని, అందని గ్రామాలకు అందేలా కృషిస చేస్తానని అన్నారు. ప్రభుత్వం ప్రతి యేటా చేపడుతున్న హరితహారం వల్ల ప్రతి పల్లెలు పచ్చదనంతో అలరారుతుందని, పల్లె ప్రకృతి వనాలతో కాలుష్య రహితంగా మారాయని అన్నారు. కొత్త జీపీల్లో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని, పనులు చేపట్టడం జరుగుతున్నాయని అన్నారు.
కుల సంఘ భవనాలు, రైతు వేదికలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు ప్రజల మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త పుల్కం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, గ్రామ సర్పంచ్ అలువాల నాగలక్ష్మి-తిరుపతి, ఎంపీటీసీ సభ్యురాలు తడిగొప్పుల రజిత-రమేశ్, గంగాధర మడ్లపల్లి గంగాధర్, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కల్వకోట శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేష్, మామిడిపల్లి అఖిల్, దూస అనిల్, పల్ల మల్లిక్, బాబు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 02:42PM