- పన్నాల ఎల్లారెడ్డి పి ఎ సి ఎస్ చైర్మన్
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్రంలో కాంగ్రెస్ సుపరిపాలన కొరకై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హాత్ సే హాత్ జొడో యాత్రను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో ప్రజలను చైతన్య పరుస్తూ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ఫిబ్రవరి 6 సోమవారం రోజున సమ్మక్క సారలమ్మ ల సన్నిధి నుండి ప్రారంభం కానుండగా అట్టి హాత్ సే హాత్ జోడో ప్రారంభ కార్యక్రమానికి ప్రజలందరూ తరలి వచ్చి అక్రమ పాలకుల నుండి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ యాత్ర ద్వారా అధికార పార్టీ అవినీతిని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్ళేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఎండగట్టేందుకు ఈ యాత్ర వేదిక కానుందని అన్నారు.
ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు నష్టపోయిన పలు సంఘటనలను ప్రజలకు వివరిస్తూ యాత్రకు అనుహ స్పందనను కల్పించాలని సభను జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ యాత్ర ద్వారా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్ధ విధానాలను కుటుంబ పాలనను వారి అవినీతిని ప్రజలకు వివరిస్తారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో విజయం సాధించి తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభం అవుతుందని రైతుల కష్టాలను పారదోలేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. రైతు రుణమాఫీ డబుల్ బెడ్ రూమ్ గృహాల పనితీరు పేదలకు ఇల్లు ఇండ్ల స్థలాలు తదితర విషయాల్లో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పసర కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు ఉప సర్పంచ్ బద్దం లింగారెడ్డి ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, పంగ శ్రీను, దేపాక కృష్ణ, దేపాక రాము తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 02:44PM