- బాబు కోనేరు స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామీణ ప్రాంతాల్లోని గుత్తి కోయల ఆర్థిక అభివృద్ధికై యు డబ్ల్యు హెచ్ ఆధ్వర్యంలో మరియు కోనేరు స్వచ్ఛంద సంస్థ సహకారంతో కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ కోఆర్డినేటర్ బాబు తెలిపారు. శనివారం మండలంలోని సోమలగడ్డ గ్రామం కన్నాయిగూడెం ప్రాంతంలో నివసిస్తున్న పందిరి దొన గుత్తి గూడెంలో ప్రతి కుటుంబానికి జీవనోపాధికై ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రతి గుత్తి కోయ కుటుంబానికి నాలుగు నాటు కోళ్లను అందించడం జరిగిందన్నారు. అంతేకాక మండల వ్యాప్తంగా ఉన్న గుత్తి కోయ గూడెంలో కూడా కోళ్లను పంపిణీ చేయడంతో పాటు ప్రతి గూడెంకు ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి వారు అందులో కూరగాయలను పండించుకొని విక్రయించుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు దోహదపడుతున్నట్లు తెలిపారు.
అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. కిచెన్ గార్డెన్ లో పండిన కూరగాయలను కూడా గుత్తి కోయలు తమ జీవనోపాధి నిమిత్తము కుటుంబ అవసరాలకు పోను మిగతా కూరగాయలను అమ్ముకొని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాము పంపిణీ చేసిన నాటు కోళ్లను పెంచుకొని అభివృద్ధి చేసి వాటిని కూడా విక్రయించి వాటి ద్వారా కూడా ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించినట్లు తెలిపారు. ముందు ముందు సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక కార్యక్రమాలను నిర్వహించి గుత్తి కోయ లలో ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యాన్ని కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు అంబేద్కర్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 02:48PM