- ఎస్ ఎఫ్ ఐ నాయకుల డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ హై స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో బ్రిలియంట్ స్కూల్ ,శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యలపై చర్యలు తీసుకోవాలని మండల ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయంలో ఎంఎస్ కో-ఆర్డినేటర్గారికి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో 2022-23 విద్యాసంవత్సరం ముగియక ముందే 2023-24 విద్యాసంవత్సరం సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్రిలియంట్ స్కూల్ స్పెషల్ డ్రైవ్ అంటూ 4 నెలల ముందు అడ్మిషన్ చేసుకుంటే స్కూల్ ఫీజు తగ్గిస్తామని అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం స్కాలర్ షిప్ టెస్ట్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసే రకంగా అడ్డ దారిన అడ్మిషన్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే అది ఎదో ప్రొడక్ట్ సేల్ కోసం సంక్రాంతి ఆఫర్ ,సమ్మర్ ఆఫర్ లాగా విద్యావ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్న విద్యాశాఖ అధికారులు కనీసం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అదే విధంగా ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రయివేటు విద్యాసంస్థ అయిన అడ్మిన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పత్రిక ప్రకటన చేయాలని అలాగే అక్రమ అడ్మిన్ విషయమై విచారణ జరిపి బ్రిలియంట్ స్కూల్,శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం గుర్తింపు రద్దు చేసే రకంగా చర్యలు తీసుకోవాలని లేని యెడల ఎం ఈ ఓ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు గణేష్ ,రాజ్ కుమార్ ,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 04:46PM