నవతెలంగాణ-కంటేశ్వర్
5వ రాష్ట్రస్థాయి ఆల్ ఇండియా మాస్టర్ గేమ్స్ ఛాంపియన్షిప్-2023 పరుగుపందెం పోటీలు ఫిబ్రవరి 2,3వ తేదీలలో హైదరాబాద్, గచ్చిబౌలి స్టేడియంలో జరిగాయిటే. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనగా వ్యాయామ ఉపాధ్యాయుడైన ఏ.శ్రీకాంత్ 100 మరియు 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకాలు సాధించాడని కరస్పాండెంట్ ప్రభాదేవి తెలియజేశారు. బంగారు పతకాలు సాధించిన వ్యాయామ ఉపాధ్యాయుడిని ఏ. శ్రీకాంత్ని పాఠశాల కార్యదర్శి డా. అమృతలత, కరస్పాండెంట్ వి.ప్రభాదేవి, అకడమిక్ డైరెక్టర్ టి.వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి.సుజాత, ప్రిన్సిపాల్ పి.విజేత ప్రత్యేకంగా అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm