- తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఆర్టి డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్, ఆటో డ్రైవర్స్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ.. రవాణా రంగంపై ఆధారపడి వేలాది మంది కార్మికులు చదువుకున్న యువత పనిచేస్తున్నారని, స్వయం ఉపాధికి కేంద్రంగా ఉన్న రవాణా రంగంలోనీ కార్మికులను విస్మరించడం సరికాదని అన్నారు.
రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని అందుకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవో ఎమ్మెస్ నంబర్ 25 ను గెజిట్ గా మార్చి ప్రయివేటు స్కూల్ బస్ డ్రైవర్లకు, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు 10 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, డ్రైవర్ లందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు సాధన కోసం ఈనెల 7న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముజీబ్, జమీల్, షేక్ మునీర్, ఇమ్రాన్, సయ్యద్ అజ్జు, అశ్వక్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 04:57PM