- పాల్గొన్న నిజామాబాద్ సభ్యులు
నవతెలంగాణ కంటేశ్వర్
ఫిబ్రవరి 4 5 తేదీలలో గుంటూరు జిల్లాలో రోటరీ జిల్లా 3150 గవర్నర్ రాజశేఖర్ రెడ్డి తల్లా అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభ్యుల వార్షిక సమ్మేళనంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు సతీష్ షాహ, పిడిజి గౌతమ్, పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ కార్యవర్గం నిర్వహించిన కార్యక్రమాల పత్రికాను రోటరీ అంతర్జాతీయ సంస్థ మాజీ అధ్యక్షులు శేఖర్ మెహతా కరములచే ఆవిష్కరింప చేయడం జరిగినది అని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ మహేష్ కోట్బాగి, పి డి జి హన్మంత్ రెడ్డి వివిధ క్లబ్స్ ల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 3150 లోని క్లబ్ లోని సభ్యుల సమ్మేళనం నిర్వహించి రానున్న రోజులలో కార్యక్రమాలు ఏర్పాటు చేసే అంశంపై సమావేశాలు ఉంటాయని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 04:58PM