నవతెలంగాణ-కంటేశ్వర్
రాష్ట్ర డైరెక్టర్ ఆప్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నరసయ్య ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో నిజామాబాద్ కోర్టులోని జిల్లా న్యాయ సేవ సదన్ హాల్లో చట్టాల వన్ వీరు గురించి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో భూకపు రాజేష్ అసిస్టెంట్ పచ్చిక్ ప్రాసిక్యూటర్ చార్జీషీట్ లో జరుగుతున్న లోపాలు, విషదీకరించారు. ఎండి రహీం ప్రాసిక్యూటర్ వివిద క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. ముద్దాయిలకు శిక్ష పడేటట్టు చూడాలని అధ్యక్షత వహించిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీనరసయ్య తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ తో పాటు నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.