నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ ప్రయివేట్ డిగ్రీ, కాలేజ్ మెనేజ్ మెంట్ అసోసియోషన్ ( ట్రుమ) ఎన్నికలు డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎస్ పి అర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. పూర్వ కమిటి సభ్యులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని, ప్రయివేట్ డిగ్రీ కళాశాలల యజమానులు పాల్గోని 2023-25 సంవత్సరనికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ ప్రసిడెంట్ గా ఎస్ వి డిగ్రీ కాలేజ్ కరస్పాండెట్ అంభోజి హరిప్రసాద్ ఎన్నిక కాగా, సెక్రటారిగా విజేత డిగ్రీ కాలేజీ సంజీవ్ సీతారం, కోశాధికారి గా SRK ఎస్ అర్ కె డిగ్రీ కాలేజ్ ఎ. దాత్తద్రి, అసోసియెట్ ప్రాసిడెంట్గా ఎస్ ఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ వి శ్రీనివాస్ రెడ్డి లను నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన వారిని ప్రయివేట్ మేనేజ్మెంట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం అధ్వర్యంలో ఘనంగా శాలువతో సన్మనించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలకు కేర్ డిగ్రీ కాలేజి యజామని నరాల. సుదాకర్, సందిపని డిగ్రీ కాలేజ్ హరిష్మన్ రెడ్డి, నిమ్స్ డిగ్రీ కాలేడీ బి. శ్రీనివాస్ రాజు, సాయిశ్రీ డిగ్రీ కాలేజీ మల్లికార్జున్ లు ఎన్నికల అధికారులు గా వ్యవహరించారు. కొత్త కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 05:02PM