- చివరి రోజు ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు
నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నాలుగు రోజుల పాటు జరిగిన మినీ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. నాలుగు రోజులపాటు మేడారం, పరిసర అడవులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తి పారవంశం పొంగి పొలింది. మేకలు, కోళ్ళు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, భక్తులు అమ్మవార్లకు సమర్పించారు. శనివారంతో మినీ జాతర ముగిసిపోయింది. చివరి రోజు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్నారు. నాలుగు రోజులపాటు జరిగిన జాతరకు సుమారు 3 లక్షల నుండి 4 లక్షల మంది భక్తులు వచ్చినట్టు దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నాలుగవ రోజు చివరి రోజు కూడా మేడారంలో, కన్నెపల్లిలో, బయ్యక్కపేటలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజులు మేడారం జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వనదేవతలను దర్శించుకుని తరించిపోయారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కట్టుదిట్టమైన ప్రణాళిక ద్వారా మినీ జాతర సజావుగా మురిసింది. జాతర ముగిసిపోవడంతో మేడారం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 05:03PM