- నాయకులు అర్జున్ హర్షం
నవతెలంగాణ - అశ్వారావుపేట
మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన అలుపెరుగని పోరాటాలు ఫలితంగా నే వారికి అదనంగా రెండు వేల రూపాయలు పెంచుతూ జీవో నెంబర్ 8 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ హర్షం వ్యక్తం చేశారు.
శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో నాగ దుర్గ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ వంట కార్మికులకు కనీస వేతనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా వీరితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు అని, పెరిగిన వేతనం గత సంవత్సరం ముఖ్యమంత్రి ప్రకటించిన నాటి నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్ధుల మెనూ చార్జీలు పెంచాలని,గ్రుడ్లు బిల్లులు,గ్యాస్ బిల్లులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కనకమ్మ, రాములమ్మ,యామిని తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 05:04PM