నవతెలంగాణ-డిచ్ పల్లి
ఈనెల 5 నుండి 9 వరకు ఒడిస్సా రాష్ట్రం పూరిలో జరగనున్న 44వ సీనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికై బయలుదేరినట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నుంచి ఎక్కువమంది క్రీడాకారులు రాష్ట్ర జట్టులో ఎంపిక కవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ జాతీయ పోటీలలో రాష్ట్ర జట్టుకు పతకం తీసుకురావడానికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మర్కంటి సుజాత, పి ఈ టి నల్లూరి లత, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ లు ఈ నరేష్, వేముల మౌనిక పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు మహిళలుఎల్ రాణి (సాంఘిక సంక్షేమ కళాశాల సుద్ధపల్లి), జె వైశాలి (సాంఘిక సంక్షేమ కళాశాల సుద్ధపల్లి), కె సృజన (సాంఘిక సంక్షేమ కళాశాల సుద్ధపల్లి), జి మమత ( సాంఘిక సంక్షేమ ఆర్మీ డిగ్రీ కాలేజ్ భువనగిరి (దుబ్బాక తాండ), ఏ ఇందు (సాంఘిక సంక్షేమ కళాశాల పోచంపాడు) ,ఏ నందిని (సాంఘిక సంక్షేమ కళాశాల పోచంపాడు), ఎస్ సౌమ్య (సాంఘిక సంక్షేమ కళాశాల తాడ్వాయి), రాణి, ఎల్ భూల బాయ్ (సాంఘిక సంక్షేమ కళాశాల తాడ్వాయి), డి మౌనిక (సాంఘిక సంక్షేమ ట్రైబల్ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్)
పురుషులు: బి సాయికిరణ్ నాయక్ (రూపుల నాయక్ తండ) ,సెంథిల్ (సాఫ్ట్ బాల్ అకాడమీ ఆర్మూర్)
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 05:07PM