నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు శనివారం గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలగోని రాజ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోడూరి సాయ గౌడ్, పాఠశాల కమిటీ అధ్యక్షుడు రమేష్ గౌడ్, గ్రామ గౌడ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm