నవతెలంగాణ-భిక్కనూర్
బోదకాల వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ సర్పంచ్ నాగర్తి పోతిరెడ్డి సూచించారు. శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బోదకాల వ్యాధిగ్రస్తులకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న నివారణ కిట్టులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm