- సాకారం కానున్న సుదీర్ఘ కల...
- నేటి నుండి ప్రారంభం...
నవతెలంగాణ - అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో గల ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేంద్రంలో శస్త్రచికిత్స సేవలు ఈ ప్రాతం ప్రజలకు కలగా ఉండేది.ఆదివారం నుండి ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పూర్ణ చంద్ శనివారం విలేకరులకు తెలిపారు. దీంతో ప్రాంతం ప్రజల సుదీర్ఘ కల సాకారం కానుంది. ఈ ఆసుపత్రి 1998లో ప్రారంభించారు. నాటి నుండి గత ఏడాది వరకు ఒకరిద్దరు వైద్యులే సేవలు అందించేవారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవ, నిధులతో డి.సీ.హెచ్.ఎస్ డాక్టర్ రవిబాబు ప్రత్యేక కృషితో స్థానిక ఆసుపత్రిలో పలు రకాల శస్త్ర చికిత్సలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శస్త్ర చికిత్సల నిర్వహణ కోసం శస్త్ర చికిత్స నిపుణులైన ఎం.ఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ తిలక్ ను నియమించినట్లు ఆయన తెలిపారు.ప్రస్తుతం కుటుంబ నియంత్రణ,హెర్నియా, హైఢ్రోసీల్, పైల్స్, ఫిస్టులా, హిస్ట్రెక్టమీ, లైఫోమా (గడ్డలు, చిన్నచిన్న కణితులు) శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి అని తెలిపారు. ఇందుకోసం ఆసుపత్రిలో జనరల్ సర్జన్ రోజంతా అందుబాటులో ఉంటారు అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 05:59PM