- ఏడేండ్లు గడిచిన అందని సదరం సర్టిఫికెట్
- పెన్షన్ కోల్పోయిన బాలుడు
- జిల్లా, మండల స్థాయిలో ఎందరు బాధితులు
నవతెలంగాణ కన్నాయిగూడెం: మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన ఒక బాలునికి జిల్లాలోని డి ఆర్ డి ఏ కార్యాలయం నుండి శనివారం సదరం సర్టిఫికెట్ ఏడు సంవత్సరాల తర్వాత అందినది. ఆ బాలుడు ఆసరా పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఏడు సంవత్సరాల నుండి వేసి చూస్తున్నాడు. 2015లో సదరం క్యాంప్ కు హాజరైనాడు అప్పటినుండి సదరం సర్టిఫికెట్ కొరకు నిరీక్షణ చేస్తున్నాడు, అయినా సదరం సర్టిఫికెట్ అందకపోవడంతో తమ బంధువుతో సదరం సర్టిఫికెట్ విషయంపై ఎంక్వైరీ పెట్టించినాడు. దీంతో సదరం సర్టిఫికెట్ 2015 లోనే 80% అంగవైకల్యంతో ఉన్నట్టు సదరం సర్టిఫికెట్ ఇష్యూ చేశారని తేలింది. దీంతో శనివారం సంబంధిత అధికారుల వద్ద సదరం సర్టిఫికెట్ ను డిజిటల్ ప్రింటు తీసుకున్నాడు అలాగే 2023 వరకు సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో బాలుడు తమ ఆసరా పెన్షన్ను కోల్పోయాడు దీంతో అధికారుల నిర్లక్ష్యం ఏ మేరకు ఉందో తెలిసిపోతుంది. అలాగే జిల్లాస్థాయిలో వివిధ మండలాల్లో ఇలాంటి బాధితులు ఎంతమంది ఉండొచ్చా ఈ పరిణామం చూస్తూనే తెలుస్తుంది ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి అర్హులైన వికలాంగులకు సదరం సర్టిఫికెట్స్ పెండింగ్ ఉంటే ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఇంత నిర్లక్ష్యానికి ఒడిగట్టిన అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 06:13PM