- ఖాళీ సిట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..
- ఆర్ఎల్ సి అబ్దుల్ బషీర్..
నవతెలంగాణ డిచ్ పల్లి
5వ తరగతి నుంచి ఇంటర్ వరకు మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల లో గల ఖాళీల కొరకు ముస్లిం మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల అర్ ఎల్ సి అబ్దుల్ బషీర్ అన్నారు.శనివారం మండల కేంద్రంలోని ఘన్ పూర్ శివారు లో ఉన్న మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల కళాశాల ను అయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు.గత ముడు రోజుల క్రితం మండలంలోని బర్దిపుర్ గ్రామ శివారులో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాల లో ఇద్దరు విద్యార్థుల మధ్య గోడల్లో ఒక విద్యార్థి సోఫియన్ మృతిచెందిన దృశ్య ముందస్తుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలో ఉన్న తరగతి గదులను, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించి అధ్యాపకులను, విద్యార్థులను కలిసి స్థితి గతులను అడిగి తెలుసుకోని పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అర్షి ఇక్బాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 06:15PM