- మల్లాపూర్ గ్రామస్తుల వినతి పత్రం అందజేత
నవతెలంగాణ డిచ్ పల్లి
ప్రభుత్వ భూమి నుంచి కోందరు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కబ్జా రాయుల్ల చేరి నుండి కాపాడాలని కోరుతూ శనివారం ఇందల్ వాయి తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రునకు సమస్యలతో కుడిన వినతి పత్రాన్ని మల్లాపూర్ సర్పంచ్ లోలం సత్యనారాయణ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లాపూర్ శివారులో ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సర్వే నెంబరు 263లోని గుర్య గుట్ట లో సుమారు 3.ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అట్టి భూమి కబ్జా కాకుండా కాపాడాలని, ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా అడ్డుకోని, మల్లాపూర్ గ్రామానికి సరిహద్దు లు గుర్తించాలని కోరుచున్నామని సర్పంచ్ లోలం సత్యనారాయణ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నర్సయ్య, ఆసది రాజన్న, గంగాగౌడ్, సంగు నరాయణ, ఎం గంగాధర్, రాజేందర్, ప్రవీణ్, గంగాధర్ తోపాటు తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Feb,2023 06:19PM