నవతెలంగాణ-నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నెపల్లి వాగులో పడి వెంకటేశ్వర్లు( 42) మృతి చెందినట్టు ఎస్సై రాజరెడ్డి శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు బుధవారం ఇంటి నుండి పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి రాలేదని చుట్టుపక్కల మరియు బంధువులకు అడిగిన ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం వాగుల మృతదేహం ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన భార్య సుజాత ఆ మృతదేహం తన భర్తదే అని గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm