నవతెలంగాణ - గోవిందరావుపేట
మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపలగూడెం ప్రభుత్వ పాఠశాలకు 15వేల విలువైన ఆట వస్తువులను శనివారం మండల వైస్ ఎంపీపీ సూది రెడ్డి, స్వప్న లక్ష్మారెడ్డి దంపతులు బహుకరించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సూది రెడ్డి స్వప్న, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ లక్ష్మారెడ్డి లు మాట్లాడుతూ సొంత గ్రామంలో పాఠశాల విద్యార్థులకు పాఠశాలకు ఏదైనా సహాయం చేయాలన్న సంకల్పంతో ఈ ఆట వస్తువులను బహుకరించినట్టు తెలిపారు. ముందు పాఠశాల అభివృద్ధికి, ఇతర సహకారాలకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. పాఠశాలకు విద్యార్థులకు ఆట వస్తువులను బహుకరించిన స్వప్న లక్ష్మారెడ్డి దంపతులను పాఠశాల ఉపాధ్యాయ బృందము, ఎస్ఎంసి సభ్యులు విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm